Sunday, December 22, 2024

నార్సింగీలో పోలీసులపై రౌడీ గ్యాంగ్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట బృందావన్ కాలనీలో పోలీసులపై రౌడీ గ్యాంగ్ దాడికి యత్నించింది. రౌడీ గ్యాంగ్ కత్తులు, హాకీ స్టిక్స్ తో దాడికి పాల్పడడంతో పాటు పోలీసుల పైకి బుల్ డాగ్స్ వదిలి రెచ్చిపోయింది. అదృశ్యమై ఎంఆర్ పిఎస్ నాయకుడు నరేందర్ అతని స్నేహితుడు ప్రవీణ్ కేసు విచారణ నిమిత్తం బృందావన్ కాలనీ వద్దకు పోలీసులు వెళ్లారు. సైట్ ఎవరిది? ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించడంతో ఒక్కసారిగా నార్సింగీ పోలీసులపైకి రౌడీలు తిరగబడడడంతో పోలీసులు భయబ్రాంతులకు గురయ్యారు. నార్సింగీ పోలీసులు పోలీస్ ఫోర్స్ ను రప్పించడంతో రౌడీలు పారిపోవడానికి ప్రయత్నించారు. నలుగురిని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. 25 కోట్ల రూపాయల విలువ చేసే స్థలం వద్ద రౌడీషీటర్లు తిష్ట వేసి హల్‌చల్ సృష్టిస్తున్నారు. అహ్మద్ ఖాన్, షేక్ హమ్దన్, మహ్మద్ జాఫర్, హామద్ మసూద్ పై 132 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి అనంతరం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  రౌడీ షీటర్ల ను రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు. వారికి న్యాయస్థానం 7 రోజుల రిమాండ్ విధించింది. వివాదాస్పద భూములకు, స్థలాలకు అడ్డాగా నార్సింగీ పోలీస్ స్టేషన్ మారింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News