Friday, November 22, 2024

75 మందిపై రౌడీషీట్…

- Advertisement -
- Advertisement -

సైబరాబాద్‌లో 13.24 శాతం పెరిగిన నేరాలు

కీలక కేసుల్లో నిందితులకు జైలు శిక్ష
కరుడుగట్టి నిందితులకు పిడి యాక్ట్
మరింత కఠినంగా ట్రాఫిక్ నిబంధనలు
18శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు
సైబర్ నేరాలు 218 శాతం పెరిగాయి
సైబరాబాద్ వార్షిక నివేదికను విడుదల చేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

Rowdy sheet open on 75 Members

మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు 13.24 శాతం పెరిగాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వార్షిక నివేదికను పోలీస్ అధికారులతో కలిసి విడుదల చేశారు. అంతకు ముందు కోవిడ్‌తో మృతిచెందిన జర్నలిస్టులకు శాంతి కలుగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భగా సిపి స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ నేరస్థులు తప్పు చేస్తే వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు మరింత చేరువయ్యేల పోలీసులు విధులు నిర్వర్తించేలా చూస్తామని తెలిపారు. సైబర్, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు ఈ ఏడాది పెరిగాయని తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నామని అందుకే కేసుల నమోదు ఎక్కువగా కన్పిస్తోందని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాల్లో నిందితులకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏడు పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని తెలిపారు. ఏడుగురు నిందితులకు హత్య కేసులో, ముగ్గరు నిందితులకు ఎస్సీ, ఎస్టీ కేసులో శిక్షపడిందని తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. నేరస్థులకు సహకరించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంధ్య శ్రీధర్ రావు కేసులో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. నార్సింగి పిఎస్ పరిధిలోని శిల్పా చౌదరి కేసులో నిందితురాలు ఏడు కోట్లు మోసం చేసినట్లు తెలిసిందని తెలిపారు. డయల్ 100కు ఫోన్ చేస్తే 6.5 నిమిషాల్లో స్పందిస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యాచారాలు 53.5శాతం పెరిగాయని తెలిపారు. ఎ క్కువ కేసుల్లో వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో నమోదయ్యాయని, కొన్ని కేసుల్లో బంధువులే బాలికలపై అత్యాచారం చేశారని తెలిపారు. ఈ ఏడాది 356కేసులు నమోదయ్యాయని తెలిపారు.

డ్రగ్స్, గంజాయిపై ప్రత్యేక దృష్టి…

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీటిని అరికట్టేందుకు ఎస్‌ఓటి పోలీసులతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు వందల కిలోల గంజాయిని పట్టుకున్నారని తెలిపారు. గ్రా మీణ, రూరల్ ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేకంగా నజర్ పెట్టామని తెలిపారు. ఈ ఏడాది 194 కేసులు నమోదు కాగా, 1,645 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 410మంది నిందితులను పట్టుకున్నామని వారిలో 23మందిపై పిడి యాక్ట్ పెట్టామని తెలిపారు. ఇప్పటి వరకు ఇరవై రెండు బాల్య వివాహాలను ఆపివేశామని తెలిపారు.

ఎవరికైనా ఒకటే రూల్ : ఎస్‌ఎం. విజయ్‌కుమార్,ట్రాఫిక్ డిసిపి

పేదవారైనా, ధనవంతులైన డ్రండ్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రాణాలు తీస్తే చట్ట ప్రకారం శిక్షిస్తామని ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. ఇ లాంటి కేసుల్లో నేరం చేసిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 18 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా 25 నుంచి 35ఏళ్ల వయస్సు ఉన్నవారు 224 మరణించారని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు డ్బ్బై ఏడు బ్లాక్ స్పాట్లు గుర్తించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను శాస్త్రీయంగా రీసెర్చ్ చేసేందుకు ఆర్‌ఎటిఎం సెల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సెల్ ఇప్పటి వరకు 311 హిట్ అండ్ రన్ కేసులను పట్టుకున్నారని తెలిపారు. ఈ చ లాన్, స్పాట్ చలాన్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపా రు. ఇప్పటి వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 61, 44,314 కే సులు నమోదు చేశామని తెలిపా రు. కమిషనరేట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 38,081నమోదయ్యాయని తెలిపారు, ఇందులో 3,861 మంది మందుబాబులకు జైలు శిక్షపడిందని తెలిపారు. వాహనాలు నడుపుతున్న 1,339 మంది మైనర్లను పట్టుకున్నామని తెలిపారు. ఐటి కారిడార్‌లో హెల్మెట్ కేసులు తగ్గాయని అన్నారు.

భారీగా పెరిగిన సైబర్ నేరాలు…

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలామంది సాఫ్ట్ వేర్ నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో సైబర్ నేరాలపై ఫిర్యాదులు ఎక్కువగా అందాయి. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నే రాలు 218శాతం పెరిగాయి. వివిధ నేరాల్లో సైబర్ నేరస్థులు రూ. 22.32 కోట్లు కొట్టేయగా అందులో రూ. 11.74 కోట్లు రికవరీ చేశారు. ఈ ఎడాది మొత్తం 30,954 కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా కస్టమర్ కేర్, ఓటిపి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 106 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశామని తెలిపారు. సైబర్ నేరాలు జరిగినప్పడు వెంటనే బాధితులు 155260కు ఫోన్ చేయాలని సిపి స్టిఫెన్ రవీంద్ర అన్నారు. ముఖ్యంగా ముప్పై రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎస్‌బిఐ, ఆర్‌బిఎల్ బ్యాంక్‌ల నకిలీ కాల్ సెంటర్ నిర్వాహకులను అరెస్టు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News