Monday, January 20, 2025

గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్‌ను మంగళ్‌హాట్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌కు చెందిన మన్‌మోహన్ సింగ్ స్థానికంగా పలు కేసులు ఉండడంతో పోలీసులు రౌడీషీట్ పెట్టారు.

నిందితుడు సులభంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయిని విక్రయిస్తున్నాడు. గతంలో పలుమార్లు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయించేందుకు వేచి చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News