Friday, January 10, 2025

టోలీచౌకిలో రౌడీషీటర్ హల్‌చల్

- Advertisement -
- Advertisement -

తమ్ముడి మృతికి కారణమని దాడికి యత్నం

మనతెలంగాణ, సిటిబ్యూరో: కత్తితో ఓ రౌడీషీటర్ హల్‌చల్ చేసిన సంఘటన నగరంలోని టోలీచౌకిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….టోలీచౌకికి చెందిన రౌడీషీటర్ ఖాజా ఫరీదుద్దిన్‌పై గొల్కొండ పోలీస్ స్టేషన్‌లో చాలా కేసులు ఉన్నాయి. ఇటీవలే ఖాజా ఫరీదుద్దిన్ తమ్ముడు మృతి చెందాడు. దానికి అతడి స్నేహితులే కారణమని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోదరుడి స్నేహితులు బంజారాహిల్స్‌లో తారసపడడంతో ఖాజా వారిని బైక్‌పై వెంబడించాడు. వారిని పట్టుకోవాలని వేగంగా బైక్ నడపడంతో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులను ఢీకొట్టాడు. దీంతో వాహనదారులు ఖాజాను పట్టుకునేందుకు వెంబడించగా టోలీచౌకి వైపు పారిపోయాడు. ఇదే సమయంలో టోలీచౌకి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసేందుకు యత్నించాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోతుండగా ఖాజాను పోలీసులు, స్థానికులు పట్టుకునేందుకు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి దూరాడు. అక్కడ ఐసియూలో ఉన్న రోగి మెడపై కత్తి పెట్టి తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా ఖాజాను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోల్కొండ ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News