Thursday, January 23, 2025

బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి చేసిన రౌడీ షీటర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిగ్‌బాస్ విన్నర్ విజె సన్నీపై రౌడీ షీటర్ దాడి చేశాడు. బిగ్‌బాస్ విజేత సన్నీ వరస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఎటిఎం అనే సినిమాలో కథనాయకుడిగా సన్నీ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హస్తినాపురంలో సినిమా షూటింగ్ జరుగుతోంది. సెట్‌కు ఓ రౌడీషీటర్ వచ్చి సన్నీపై దాడి చేశాడు. వెంటనే సినిమా యూనిట్ సభ్యులు సన్నీని కారులో పంపించేశారు. యూనిట్ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News