Sunday, December 22, 2024

యూట్యూబ్ జర్నలిస్ట్ పై రౌడి షీటర్ కత్తి పోట్లు..

- Advertisement -
- Advertisement -

మైలార్ దేవ్ పల్లిలో రౌడీ షీటర్ సోహెల్, అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి యూటూబ్ చానెల్ రిపోర్టర్ మూబీన్ పై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ‘ఇప్పుడు తప్పించుకున్నావు.. ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తా’ అంటూ రౌడీ షీటర్ వార్నింగ్ ఇచ్చాడు. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడి చేసి సోహెల్ గ్యాంగ్ పరారైంది. కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడిన ముబీన్ ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.

రౌడీ షీటర్ సోహెల్ అరాచకాలను తన‌ యూటూబ్ లో టెలిక్యాస్ట్ చేసినందుకు ముబిన్ పై సోహెల్ పగ పెంచుకున్నట్లు తెలుస్తోంది. యూటూబ్ నుండి ఆ లింక్ తీసేయ్.. లేకపోతే చస్తావంటూ పలుమార్లు బెదిరించినా.. వార్తకు సంబంధించిన లింక్ ను ముబీన్ తొలగించలేదు. దీంతో మూబీన్ పై కత్తులతో దాడిచేసినట్లు సమచారం. రౌడీ షీటర్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. బాధితుడికి జర్నలిస్టు సంఘాలు మద్దతగా నిలిచాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్ దేవ్ పల్లి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారిలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News