Thursday, January 23, 2025

నాంపల్లిలో రౌడీషీటర్ వీరంగం..

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : నాంపల్లిలో దర్గా షాఖముష్ ప్రాంతంలో రౌడీషీటర్ మత్తులో వీరంగం సృష్ఠించి స్థానికులను హడలెత్తించాడు. కొన్ని రోజులుగా స్థబ్దుగా ఉన్న రౌడీ మోయిద్ అలియాస్ అండా రోటీ మళ్లీ రెచ్చిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున పీలకవరకు గంజాయ్ మత్తులో విచక్షణకోల్పోయి వచ్చేపోయే వారిని డబ్బులు ఇవ్వమంటూ బెదిరించాడు. ఇలా వరసగా ముగ్గురిపై కత్తితో దాడులకు తెగబడ్డాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావంతో ఉన్న వారిని బస్తీవాసులు హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు రెకేత్తించిన ఈ ఘటన సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం… స్థానికుడు లతిఫ్ అనే వ్యక్తి తన విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నండగా మోయిద్ కత్తి చూపించి అటకాయించాడు.

డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ససేమిరా అన్నందుకే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన రౌడీ అతనిపై దాడిచేశాడు. వెంటనే బాధితుడు అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తన సోదరుడు మహమ్మద్ జుహూర్‌కి వివరించాడు. అతను మోయిద్‌ను నిలదీయగా జుహుర్‌ను అసభ్యంగా దూషించి చాతిపై బలంగా కత్తితో పలుమార్లు పొడిచాడు. ఈ క్రమంలో రౌడీ ఆగడాలను అడ్డుకోబోయిన మొహినుద్దీన్ ఇతరులపై కత్తితో దాడి చేశాడు. ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు. పలువురు స్వల్పంగా గాయాలయ్యాయి. కత్తిపోట్ల ఘటన స్థానికంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జుహుర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

హబీబ్‌నగర్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు పోలీసులు రౌడీషీటర్ మోహిద్‌పై పరారీలోఉన్నాట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News