Wednesday, January 1, 2025

నిజామాబాద్ లో రౌడీ షీటర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివసించే జంగిల్ ఇబ్బు ఒక రౌడీ షీటర్. అతను ఇటివలే పిడియాక్టులో జైలుకు వెళ్లి వచ్చాడు. కాగా ఆదివారం సాయంత్రం పట్టణ శివారులో రక్తం మడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు రౌడీ షీటర్ ఇబ్బు గా గుర్తించారు.పాత కక్షల నేపథ్యంలో ఇబ్బును హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఇబ్బు , మరో రౌడీషీటర్ ఆరిఫ్ వర్గాల మధ్య దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News