Wednesday, January 15, 2025

రోడ్డు ప్రమాదంలో రౌడీషీటర్ మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ రౌడీషీటర్ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం….. కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ సుల్తాన్ బజార్, లేక్ పోలీస్ స్టేషన్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. శ్రీకాంత్‌పై పలు కేసులు ఉండడంతో పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఒళ్ళంతా పచ్చ బొట్లు వేయించుకున్న శ్రీకాంత్‌కు సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. రోడ్లపై బైక్‌తో స్టంట్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు, వీటితో ఫాలోవర్స్‌ను పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే బైక్‌పై స్టట్స్ చేస్తూ లారీ చక్రాల కింద పడి చనిపోయాడు. సవేరా హోటల్ సమీపంలో బైక్‌పై స్టంట్ చేస్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది, దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు.మృతుని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News