Tuesday, April 15, 2025

మూడ్రోజుల క్రితమే పెళ్లి.. ఓల్డ్ సిటీలో రౌడీషీటర్ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓల్డ్ సిటీలో దారుణ హత్య జరిగింది  ఫలక్నుమా పరిధిలోని రెయిన్ బజార్లో రౌడీషీటర్ మాస్ యుద్ధీన్పై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఈ హత్యకు సంబంధించిన వివరాలను స్థానికుల నుంచి సేకరించిన పోలీసులు.. ప్రత్యర్థులే యుద్ధీన్ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితమే మాస్ యుద్ధీన్కి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News