Wednesday, January 22, 2025

అర్ధరాత్రి మేయర్ ఇంట్లోకి చొరబడిన రౌడీషీటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి ఇంట్లోకి రౌడీషీటర్ చొరబడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బంజరాహిల్స్‌లో ఎన్‌బిటి నగర్‌లో విజయ లక్ష్మి ఉంటున్నారు. అర్థరాత్రి సమయంలో యూసఫ్‌గూడకు చెందిన రౌడీషీటర్ లక్ష్మణ్ గోడదూకి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె గదిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా లక్ష్మణ్‌ను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. మేడంతో అత్యవసరమైన పని ఉండడంతోనే ఆమె కలిసే అందుకు వచ్చానని లక్ష్మణ్ తెలిపాడు. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగినప్పుడు ఆమె ఇంట్లో లేరు. ఆమె తండ్రి కేశవరావుకు మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో ఆమె ఆస్పత్రిలోనే ఉండిపోయారు. మేయర్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News