మనతెలంగాణ, హైదరాబాద్ : కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీషీటర్‌ను నేరెడ్‌మెట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… మేడ్చెల్ జిల్లా, మల్కాజిగిరి మండలం, నేరెడెమెట్‌కు చెందిన బోడుసు కళ్యాణ్‌పై పోలీసులు రౌడీషీట్ పెట్టారు. నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కిరాణ షాపుకు వెళ్లి కూల్‌డ్రింక్ ఉచితంగా ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. ఉచితంగా ఇచ్చేందుకు నిరాకరించడంతో సిమెంట్ ఇటుకలతో బాధితుడికి, అతడి కుమారుడికి గాయాలయ్యాయి. మరో కేసులో వినాయక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యకు బ్రేక్‌ఫాస్ట్ తెచ్చేందుకు వెళ్లాడు.
ఇది గమనించిన కళ్యాణ్ అతడి ఇంటికి వెళ్లి భార్య చేతులు పట్టుకోవడమేకాకుండా కళ్లపై తన్నాడు. అంతేకాకుండా కత్తితో బెదిరించి పర్సులో ఉన్న రూ.2,300 తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు గతంలో ఇలాంటి పనులు చేయడంతోనే నేరెడ్‌మెట్ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయినా కూడా నిందితుడి ప్రవర్తనలో మార్పు రాకుండా పలువురిని బెదిరింపులకు దిగుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.