- Advertisement -
పాతకక్షలే కారణం
మనతెలంగాణ, హైదరాబాద్ : పాతకక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫానగర్‌లో పాతబస్తీ కాలాపత్తర్‌కు చెందిన జాబిర్ను కత్తులతో పొడిచి చంపివేశారు. అనేక కేసుల్లో జాబిర్ నేరస్థుడిగా ఉన్నాడు. పాతకక్షల వల్లే ప్రత్యర్థులు జాబిర్ను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -