Monday, March 31, 2025

చెన్నై లక్ష్యం 197

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196  పరుగులు తీసింది. బెంగళూరు జట్టులో దూకుడుగా ఆడుతున్న ఫిల్ సాల్ట్(32) ను ధోని తన అద్భుతమైన స్టంపింగ్ తో పెవిలియన్ బాటపట్టించాడు. ఆ తర్వాత అశ్విన్ వేసిన బంతికి దేవదత్ పడిక్కల్ (24) ఔటయ్యాడు. 12 ఓవర్ లో నూర్ అహ్మద్ బంతికి విరాట్ కొహ్లి(31) రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రజత్ పటీదార్ (51; 3 సిక్స్ లు, 4 ఫోర్లు),జితేశ్ శర్మ(12), టిమ్ డేవిడ్(22; 7 బంతుల్లో 3 సిక్స్ లు,1 ఫోరు) పరుగులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News