Wednesday, January 22, 2025

ఢిల్లీ క్యాపిటల్స్‌కు సవాల్.. నేడు బెంగళూరుతో ఢీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే పోరు సవాల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఢిల్లీ నెలకొంది. ప్లేఆఫ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌ను తప్పక గెలవాల్సిన స్థితి క్యాపిటల్స్‌కి ఏర్పడింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆరు మ్యాచుల్లో జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పటిష్టమైన బెంగళూరుతో పోరు క్యాపిటల్స్‌కి చావోరేవో తయారైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ తీవ్ర ఒత్తిడికి గురువుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వార్నర్ సేన పూర్తిగా తేలిపోతోంది. అత్యంత పేలవమైన ప్రదర్శనతో వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు విఫలమవుతుండడం ఢిల్లీకి ప్రతికూలంగా మారింది. బెంగళూరు వంటి బలమైన జట్టుతో జరిగే మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్లు పూర్తి సామర్థం మేరకు రాణించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం ఢిల్లీని వెంటాడుతోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నాడు. ఒకప్పుడూ ఐపిఎల్‌లో ఎదురులేని బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న వార్నర్‌లో ప్రస్తుతం ఆ జోష్ కనిపించడం లేదు. అతని వైఫల్యం జట్టుకు సమస్యగా తయారైంది. మరో ఓపెనర్ సాల్ట్ కూడా జట్టుకు అండగా నిలువలేక పోతున్నాడు. ప్రియమ్ గార్గ్, మనీష్ పాండే, రొసొ తదితరులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. అయితే కిందటి మ్యాచ్‌లో అక్షర్ పటేల్, హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్ తదితరులు రాణించడం జట్టుకు కాస్త ఊరట కలిగించే అంశమే. అంతేగాక గుజరాత్ జరిగిన కిందటి మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని విజయం సాధించడం ఢిల్లీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో బెంగళూరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న చాలెంజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News