Monday, December 23, 2024

గుజరాత్ టైటాన్స్ పై బెంగళూరు ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. చిన్న స్వామి స్టేడియంలో శనివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలుపొందింది. 147 స్వల్ప లక్ష ఛేదనకు దిగిన బెంగళూరుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(42), డూప్లెసీస్(64) బ్యాట్‌తో చెలరేగగా చివరలో దినేశ్ కార్తీక్(21) రాణించడంతో మరో 38 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి సునయాస విజయాన్ని అందుకుంది. ఇక గుజరాత్ బౌలర్ జోస్ లిటిల్ 4 వికెట్లతో బెంగళూరును కట్టడి చేయాలనుకున్నా ఫలితం దక్కలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు టాప్ అర్డర్స్ నుంచి శుభారంభం దక్కలేదు. మిడిలార్డర్స్‌లో బ్యాటింగ్ వచ్చిన షారుఖ్ ఖాన్(37), డెవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35)లు రాణించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. గుజరాత్ 19.3 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, యష్ దయాల్, వైశాఖ్ విజయ్ రెండేసి వికెట్లు పడగొట్టి గుజరాత్ నడ్డీ విరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News