Thursday, January 23, 2025

గుజరాత్ టైటాన్స్ పై బెంగళూరు ఘన విజయం

- Advertisement -
- Advertisement -

విల్ జాక్స్, విరాట్ కోహ్లీ విరవిధ్వంసంతో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ చిత్తు చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు మిగిలుండగానే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విల్ జాక్స్ 100 నాటౌట్ (41 బంతులు; 5×4, 10×6) మెరుపు శతకం చేయగా అతడికి తోడుగా విరాట్ కోహ్లి 70నాటౌట్ (44 బంతులు; 6×4, 3×6) వీరవిధ్వంసం చేశారు. డబుల్ హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతున్న బెంగళూరుకు ఇది రెండో గెలుపు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 84 నాటౌట్ (49 బంతులు; 8×4, 4×6), షారుక్ ఖాన్ 58 (30 బంతులు; 3×4, 5×6) అర్ధశతకాలతో రాణించారు. ఇక బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ (1/23), మాక్స్‌వెల్ (1/28), సిరాజ్ (1/34) తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష ఛేదనకు దిగిన బెంగళూరు ఆదిలో డుప్లెసిస్ 24 (12 బంతులు; 1×4, 3×6) ఔటైయ్యాడు. అనంతరం వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విల్ జాక్స్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. స్పిన్‌లో కోహ్లి సిక్సర్లతో చెలరేగి పోయాడు. ఈ క్రమంలో తొలి పవర్‌ప్లేలో 63 పరుగులు పిండుకుంది బెంగళూరు. ఇక తొలుత ఆచీతూచి ఆడిన జాక్స్ ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు దాటించాడు. దీంతో బెంగళూరు 10 ఓవర్లలో 98 మార్క్ చేరుకుంది. ఈ క్రమంలో కోహ్లి అర్ధశతకం పూర్తి చేసున్నాడు. అయితే బ్రేక్ సమయానికి బెంగళూరు విజయానికి 42 బంతుల్లో 67 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికీ జాక్స్ 25 బంతుల్లో 37 పరుగులే చేశాడు. కానీ బ్రేక్ అనంతరం శివాలెత్తి జాక్స్ గుజరాత్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. సిక్సర్లతో చుక్కలు చూపించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న జాక్స్ 41 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక బెంగళూరు గెలుపునకు ఒక్క పరుగు వాలసి ఉండగా భారీ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించడమే కాకుండా సెంచరీ పూర్తి చేసుకున్నాడు జాక్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News