Friday, December 20, 2024

హైదరాబాద్ పై బెంగళూరు విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కిందటిసారి సన్‌రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

ఓపెనర్లు విరాట్ కోహ్లి (51), డుప్లెసిస్ (25) శుభారంభం అందించారు. రజత్ పటిదార్ 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. గ్రీన్ కూడా ధాటిగా ఆడి 37 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగుల మాత్రమే చేసి పరాజయం పాలైంది. అభిషేక్ శర్మ (31), షాబాజ్ అహ్మద్ 40 (నాటౌట్), కమిన్స్ (31) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News