Wednesday, January 22, 2025

రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త ‘బుల్లెట్’

- Advertisement -
- Advertisement -

 

Royal Enfield

ముంబై: ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ శ్రేణిలో రెండు మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. బుల్లెట్ 350, బుల్లెట్ 350ఈఎస్ మోడళ్లకు దేశీయ విపణిలో మాంచి గిరాకీ ఉంది. తాజాగా, రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350ని మరింత ముస్తాబు చేసి కొత్త బుల్లెట్ ను తీసుకువస్తోంది. ఇది కూడా 350 సీసీ సెగ్మెంట్లోనే ఉంటుందట. రాయల్ ఎన్ ఫీల్డ్ తన కొత్త మోడల్ ‘హంటర్’ ను ఆగస్టు 7న ఆవిష్కరించనుండగా, అంతకు రెండ్రోజుల ముందే ఆగస్టు 5న కొత్త తరం బుల్లెట్ 350ని పరిచయం చేయనుంది. దీంట్లో 349 సీసీ జే ప్లాట్ ఫాం ఇంజిన్ అమర్చారు. ఇటీవల తీసుకువస్తున్న మోడళ్లను రాయల్ ఎన్ ఫీల్డ్ అత్యాధునిక జే ప్లాట్ ఫాంపైనే నిర్మిస్తోంది. 346 సీసీ యూసీఈ ఇంజన్లకు స్వస్తిపలుకుతూ నూతన టెక్నాలజీతో కూడిన ఇంజిన్లవైపు ఈ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం మొగ్గుచూపుతోంది. కొత్త బుల్లెట్ 350లో స్ల్పిట్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన గేర్ బాక్స్, ఎలక్ట్రిక్ స్టార్టర్ (స్టాండర్డ్), ట్రిప్పర్ నేవిగేషన్ పోడ్ (ఆప్షనల్) పొందుపరిచారు. దీని ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ.1.7 లక్షలు ఉండొచ్చని అంచనా.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News