Sunday, December 22, 2024

సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

- Advertisement -
- Advertisement -

Royal enfield hunter 350 launched in hyderabad

హైదరాబాద్ : మిడ్-సైజ్డ్ మోటా ర్ సైకిల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త హం టర్ 350 మోటార్ బైక్‌ను తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. సైక్లింగ్‌లో ‘టూ-వీల్ డబుల్ ఎస్‌ప్రెస్సో’ను నగరంలోని రద్దీ వాతావరణానికి అనుకూలంగా రూపొందించారు. రెండు వేరియంట్లు, ఎనిమిది ఆకర్షణీయమైన రంగుల్లో ప్రీమియం, స్టైలిష్ లుక్‌ను కల్గివుంది. భారతదేశ వ్యాప్తంగా బుధవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్ హంటర్ 350 తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 75 టచ్ పాయింట్‌లలో అందుబాటులో ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సిఇఒ బి.గోవిందరాజన్ మాట్లాడుతూ, కొత్త అనుభవాలను సృష్టించేందుకు, మోటార్ సైక్లింగ్‌కు చెందిన కొత్త మోడళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ శ్రేణిలో విశిష్టతను కలిగి ఉందని అన్నారు. కొత్త హంటర్ 350 ధర రూ.1,49,900 (ఎక్స్-షోరూమ్, చెన్నై), డ్రేపర్ సిరీస్‌కు రూ.1,63,757, రెబల్ సిరీస్‌కు రూ.1,67,757 (ఎక్స్-షోరూమ్, తెలంగాణ) కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News