Sunday, December 22, 2024

రాయల్ ఎన్‌ఫీల్డ్ రికార్డు అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా 2,29,496 మోటారు సైకిళ్లను సంస్థ విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 13 శాతం పెరగడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 2,03,451బైక్‌లను విక్రయించింది.ఆగస్టులో 77,583 యూనిట్లను విక్రయించగా, సెప్టెంబర్‌లో 78,580 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో విక్రయాలు 11 శాతం పెరగ్గా సెప్టెంబర్‌లో 4 శాతం తగ్గాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అప్‌డేట్ చేసి కొత్తగా విడుదల చేసిన క్లాసిక్ 350 అత్యధికంగా అమ్ముడు పోయిన బైక్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. మెటోర్ 350, హంటర్ బైకులు కూడా మంచి నంబర్లనే సాధించాయి. మరో వైపు ఇటీవల ఇటలీలో నిర్వహించిన ఇఐసిఎంఎ 2023 ఈవెంట్‌లో హిమాలయన్ 450ని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆవిష్కరించింది.అలాగే హిమాలయన్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్‌ను కూడా ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ మోటారు సైకిల్‌నుత్వరలోనే తీసుకు వచ్చేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సన్నాహాలు చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News