లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు నాలుగు రోజుల ముందు ప్రజల సందర్శనకు అనుమతించడంతో 2,50,000 మంది సందర్శించి నివాళి అర్పించారు. ఈ మేరకు మంగళవారం నివేదికను వెల్లడించారు. ఈ నెల ఎలిజబెత్ రాణి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ ఎస్టేట్‌లో కనుమూశారు. గత బుధవారం నుంచి సోమవారం ఉదయం 6.30వరకు రాణికి నివాళి అర్పించేందుకు ప్రజలు ప్రతిరోజూ 24గంటలు బారులు తీరారు. వెస్ట్‌మినిస్టర్ రాణి కాఫిన్‌ను సందర్శించి ప్రజలు తుది నివాళి అర్పించారు. పార్లమెంటు నుంచి థేమ్స్ దక్షిణవంతెన మీదుగా సౌత్వార్క్ పార్క్ టవర్ బ్రిడ్జి వరకు బారులు తీరి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యదర్శి మిచెల్లి మాట్లాడుతూ సుమారు పావు మిలియన్ ప్రజలు నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. నివాళి అర్పించినవారిలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బేక్‌హామ్ కూడా ఉన్నాడు. కాగా రాణి ఎలిజబెత్‌కి సోమవారం సాయంత్రం ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు.
రాణి అరుదైన ఫొటోను విడుదల చేసిన రాయల్ ఫ్యామిలీ
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల అనంతరం ఇంతకుముందు వెలుగు చూడని రాణి ఫొటోను రాయల్ ఫ్యామిలీ విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన ఫొటోలో షేక్‌స్పియర్ హామ్లెట్‌లో చెప్పినట్లు..దేవదూతల విమానాలు నీ విశ్రాంతికోసం పాడతాయని పేర్కొన్నారు. తన తల్లి మరణంపై టీవీలో ప్రజలను ఉద్దేశించి కింగ్ ఛార్లెస్ మాట్లాడుతూ షేక్‌స్పియర్ రాసిన లైనును ప్రస్తావించారని బిబిసి నివేదించింది. తల్లి ఎలిజబెత్ రాణి మధుర జ్ఞాపకార్థం కింగ్ చార్లెస్ ఆవిధంగా పేర్కొన్నారని బిబిసి తెలిపింది. కాగా రాజకుటుంబం విడుదల చేసిన ఫొటోలో రాణి చేతికర్ర సాయంతో నడుస్తున్నట్లుగా ఉంది. హెడ్‌స్కార్, సన్‌గ్లాసెస్ ధరించి మరో చేతిపై కోటుతో కొండప్రాంతంలో నడుస్తున్నట్టుగా ఉంది.
‘May flights of Angels sing thee to thy rest.’
In loving memory of Her Majesty The Queen.
1926 – 2022 pic.twitter.com/byh5uVNDLq
— The Royal Family (@RoyalFamily) September 19, 2022
Royal Family Release Unseen photo of Queen Elizabeth-2