Wednesday, January 22, 2025

పుజారా శతక్కొట్టుడు..

- Advertisement -
- Advertisement -

Royal London ODI: Pujara hit Fastest Century

పుజారా శతక్కొట్టుడు
రాయల్ లండన్ వన్డేకప్‌లో వరుసగా రెండో సెంచరీ
లండన్: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ ఛటేశ్వర్ పుజారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ విజృంభిస్తున్నాడు. రాయల్ లండన్ వన్డేకప్ 2022లో రెండో సెంచరీ నమోదు చేశాడు. సస్సెక్స్ తరఫున ఆడతున్న పుజారా ఈనెల 12న జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 79బంతుల్లోనే 7ఫోర్లు, 2సిక్స్‌లతో తన కెరీర్లోనే అద్భుత సెంచరీని నమోదు చేశాడు. పుజారా ఒకే ఓవర్లో 22పరుగులు సాధించడం విశేషం. ఫామ్‌లో ఉన్న పుజారా ఆదివారం చిరస్మరణీయ మరో సెంచరీ నమోదు చేశాడు. 131బంతుల్లో 174పరుగులు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ టామ్ హెయిన్స్ స్థానంలో స్కిప్పర్‌గా అవతారమెత్తిన పుజారా సర్రెతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 9పరుగులకే 2వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన పుజారా అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో సస్సెక్స్ 50ఓవర్లలో 6వికెట్లకు 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

Royal London ODI: Pujara hit Fastest Century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News