Monday, December 23, 2024

మలక్‌పేటలో రాయల్ ఓక్ స్టోర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఫర్నిచర్, హైదరాబాద్ లోని మలక్ పేట లో తమ స్టోర్‌నుప్రారంభించడం ద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఈ స్టో ర్‌ను అభిమానుల సమక్షంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ ఛైర్మన్ విజయ్ సుబ్రమణియం, మేనేజింగ్ డైరెక్టర్ మథన్ సుబ్రమణియం, రిటైల్ హెడ్ హెచ్ ఎస్ సురేష్ , ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ స్టేట్ హెడ్ ప్రద్యుమ్న కరణం , సేల్స్,మర్చండైజింగ్ హెడ్ ప్రశాంత్ కోటియాన్ ప్రారంభించారు. దాదాపు 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ విస్తృత శ్రేణిలో లివింగ్ రూమ్స్, బెడ్రూమ్స్, డైనింగ్ రూమ్స్ మరెన్నో వాటికి తగిన ఫర్నిచర్ అందిస్తుంది. ఈ స్టోర్‌తో హైదరాబాద్ లో రాయల్ ఓక్ మొత్తం స్టోర్స్ సంఖ్య 19 కు చేరింది. ఈ స్టోర్ ప్రతి సంవత్సరం 2 లక్ష కంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News