- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయల్పాడులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనివాసపురం, కోలార్, మదనపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుడా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
- Advertisement -