హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సరళకు ‘వార్దీ నహీ యే కాల్ హై’ సిటీజన్స్ గాలెంట్ వారియర్ అవార్డు- 2023తో పాటు భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా రూ.50,000/- నగదును శుక్రవారం అందుకున్నారు. సరళ ప్రస్తుతం నిజామాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు . రైలు ప్రయాణికులను రక్షించడంలో ఆమె తీసుకున్న సమయస్ఫూర్తి, ఆమె వ్యవహారించిన తీరుకు ఆమెకు ఈ అవార్డు లభించింది.
9వ తేదీ మార్చి, 2022న సుమారు 11.08 గంటలకు రైలు నెం.17057 దేవగిరి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం నెం 1పైకి వస్తుండగా ఒక మహిళా ప్రయాణికురాలు నడుస్తున్న రైలులో నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫాం మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన సరళ అప్రమత్తమై ఆమెను వేగంగా ప్లాట్‌ఫాంపైకి వెనక్కి లాగింది. దీంతో ఆమెకు ఎటువంటి గాయం లేకుండా ఒక విలువైన ప్రాణాన్ని కాపాడింది.
ప్లాట్‌ఫాం, నడుస్తున్న రైలుకు మధ్య ఉన్న గ్యాప్‌లో
దీంతోపాటు 19వ తేదీ సెప్టెంబర్, 2022న సుమారు రాత్రి 10 గంటలకు రైలు నంబర్ 16004లో ప్రయాణించడానికి నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన మరో మహిళా ప్రయాణికురాలిని సైతం ఆమె రక్షించింది. నడుస్తున్న రైలు నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించి ప్లాట్‌ఫాంకు, నడుస్తున్న రైలుకు మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. ఇది చూసిన వెంటనే సరళ మరో కానిస్టేబుల్‌తో కలిసి ఆమెను రక్షించింది. ఈ విధంగా మహిళా కానిస్టేబుల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇమేజ్‌ను నైతికతను పెంచారు. విధి నిర్వహణలో సరళ చూపిన ధైర్యం, తక్షణ ప్రతిస్పందన ద్వారా ఇద్దరు మహిళా ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. దీంతో ఆమెను సిటీజన్స్ గాలంట్ వారియర్ అవార్డుకు ఎంపిక చేశారు.
సరళను అభినందించిన జిఎం
ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కుమార్ జైన్ సరళను అభినందించారు. సరళ తన విధి నిర్వహణలో సమయస్ఫూర్తి రైలు ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి దారి తీసిందని ఆమె ధైర్యసాహసాలు, చురుకుదనాన్ని జనరల్ మేనేజర్ ప్రశంసించారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అవుట్ టీం సభ్యులు అందుకోవడం అలాగే జోన్‌కు కూడా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.