Friday, December 20, 2024

నిద్రిస్తున్న మైనర్ బాలుడిపై కానిస్టేబుల్ కర్కశత్వం.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

లక్నో: మానవ విలువలు మరిచి క్రూరత్వంగా ప్రవర్తించిన ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌, బల్లియాలోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న మైనర్ బాలుడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) పోలీసు కానిస్టేబుల్ బూటు కాలితో తొక్కి కర్కశంగా ప్రవర్తించాడు. అంతేకాదు, దుర్భాషలాడుతూ కాలితో తన్నాడు.

ఈ ఘటనను చుట్టు ప్రక్కలవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. చిన్న బాలుడు అని చూడకుండా దారుణంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై నెటిజన్లు మండిపడుతూ.. అతనిపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News