Monday, January 20, 2025

చిన్నపిల్లల అక్రమ రవాణా.. 34 మంది చిన్నారులకు విముక్తి

- Advertisement -
- Advertisement -

కాజీపేట: బీహార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 34 మంది చిన్నారులను కాజీపేట జంక్షన్ వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), శిశు సంక్షేమ శాఖ అధికారులు రక్షించారు. అధికారులు బీహార్ నుండి సికింద్రాబాద్‌కు ప్రయాణిస్తున్న దర్బంగా ఎక్స్‌ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించారు. 10 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల మైనర్ పిల్లలను రక్షించారు.

పిల్లల అక్రమ రవాణా ముఠా వారిని సికింద్రాబాద్‌కు తరలించి వివిధ పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులు ఉపాధి చూపి పిల్లలను, వారి కుటుంబ సభ్యులను ప్రలోభపెడుతున్నారని శిశు సంక్షేమ అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు వేగంగా పనిచేసి కాజీపేట జంక్షన్ వద్ద ఈ చిన్నారులను గుర్తించగలిగారు. రక్షించబడిన పిల్లలను వారి భద్రత కోసం పిల్లల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. నలుగురు మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News