Wednesday, January 22, 2025

స్మగ్లింగ్ సిగరెట్లను పట్టుకున్న ఆర్‌పిఎఫ్ అధికారులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలో పనిచేసే ఆర్‌పిఎఫ్ అధికారులు లక్షల విలువచేసే స్మగ్లింగ్ సిగరెట్లను పట్టుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇంటలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు రూ. 67.50 లక్షలు విలువగల సిగరెట్లను ఆర్‌పిఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాన్ ఇండియా డ్రైవ్‌లో భాగంగా డైరెక్టర్ జనరల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్ ) ఆదేశానుసారం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలను నిర్వహిస్తున్నారు.

ఆర్‌పిఎఫ్ , హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు నంబర్ 12724 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ లో అన్‌లోడ్ చేయబడిన అనుమానాస్పద స్థితిలో గమనించిన పార్శిళ్లను ఆర్‌పిఎఫ్ అండ్ జిఆర్‌పి పోలీసు బృందాలు సంయుక్తంగా తనిఖీ చేశాయి. ఈ తనిఖీలో 15 పార్శిల్స్ న్యూ ఢిల్లీలో లోడ్ చేసినట్టు ఆర్‌పిఎఫ్ అధికారులు గుర్తించారు. వాటిని తెరచి చూడగా 4,50,000 విదేశీ బ్రాండ్ ‘పారిస్’ సిగరెట్‌లను (45) కార్టూన్ బాక్స్‌లను గుర్తించారు.
ప్రతి సిగరెట్ స్టిక్‌కు రూ.15 నుంచి రూ.20లు
కాగా సిగరెట్లను బుక్ చేసే క్రమంలో పార్సిళ్లను బుక్ చేసే వ్యక్తులు కిరాణా వస్తువులను రవాణా చేస్తున్నట్టు తప్పుడు సమాచారంతో న్యూఢిల్లీలో వాటిని బుక్ చేశారు. ఈ మేరకు ఆర్‌పిఎఫ్ పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి వాటిని పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి సిగరెట్ స్టిక్‌ను రూ.15ల నుంచి రూ.20ల వరకు విక్రయిస్తుంటారు. దీనిని బట్టి స్మగ్లింగ్ సిగరెట్ల మొత్తం విలువ సుమారు రూ. రూ.67.50 లక్షలు ఉంటుందని ఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు. సీజ్ చేసిన సిగరెట్లను కస్టమ్స్ విభాగానికి అప్పగించారు.

ఈ ఘటనకు సంబంధించి తప్పుడు పేరుతో పార్శిల్ బుక్ చేసిన వ్యక్తిపై ఆర్పీఎఫ్ హైదరాబాద్ వారు రైల్వే చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ రాజారాం స్పందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక అంశాలను ప్రభావితం చేసే అక్రమ సిగరెట్ల స్మగ్లింగ్ ఎంతో ఆందోళన కలిగిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఈ రకమైన తనిఖీలు నిర్వహిస్తామని, నిషేదిత వస్తువుల రవాణాను అరికట్టడానికి మరింత నిఘా పెంచుతామని అయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News