Monday, December 23, 2024

ప్లేఆఫ్‌పై రాజస్థాన్ కన్ను

- Advertisement -
- Advertisement -

నేడు చెన్నైతో పోరు

చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 8 పోటీల్లో జయభేరి మోగించింది. చెన్నైపై కూడా గెలిస్తే రాజస్థాన్‌కు నాకౌట్ బెర్త్ ఖాయమవుతోం ది. మరోవైపు చెన్నై 12 మ్యాచులు ఆడి ఆరింటి లో మాత్రమే విజయం సాధించింది. ఇలాంటి స్థితిలో మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడమే కాకుండా నాకౌట్ బెర్త్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. ఈ సీజన్‌లో రాజస్థాన్ అసాధారణ ఆటతో అలరిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆకాశమే హద్దు గా చెలరేగిపోతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితా న్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు.

జట్టు విజయాల్లో వీరిద్దరూ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా జట్టును ముందుం డి నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శాంసన్ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా శాంసన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. విధ్వంసక బ్యాటింగ్‌తో శాంసన్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. చెన్నైపై కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నా డు. రొమన్ పొవెల్, రియాన్ పరాగ్, శుభమ్ దూబె, హెట్‌మెయిర్, అశ్విన్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. పొవెల్, పరాగ్, హెట్‌మెయిర్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఇబ్బందులు ఖాయం.

బౌలింగ్‌లో కూడా రాజస్థాన్ సమతూకంగా కనిపిస్తోంది. అశ్విన్, సందీప్ శర్మ, బౌల్ట్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్‌కు ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో శాంసన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేక పోయా డు. ఢిల్లీపై ఓడడంతో రాజస్థాన్ కాస్త ఒత్తిడిలో క నిపిస్తోంది. కానీ సిఎస్‌కెతో జరిగే మ్యాచ్‌లో గెలి చి నాకౌట్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది.

సవాల్ వంటిదే..

మరోవైపు రాజస్థాన్‌తో పోరు చెన్నై సూపర్ కింగ్స్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. గుజరాత్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం చచిచూసింది. దీంతో జట్టు ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో బలమైన రాజస్థాన్‌ను ఓడించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. కొన్ని మ్యాచులుగా ఓపెనర్లు అజింక్య రహానె, రచిన్ రవీంద్రలు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. గుజరాత్ మ్యాచ్‌లో ఓపెనర్లు విఫలమయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగాలనే పట్టుదలతో రుతురాజ్ ఉన్నాడు. అతనితో పాటు ఓపెనర్లు కూడా రాణిస్తే చెన్నైకి భారీ స్కోరు ఖాయం. మరోవైపు డారిల్ మిఛెల్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, ధోనీ తదితరులతో చెన్నై బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక తుషార్ దేశ్‌పాండే, సాంట్నర్, జడేజా, శార్దూల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో చెన్నైకి కూడా గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News