Monday, April 14, 2025

సమరోత్సాహంతో గుజరాత్

- Advertisement -
- Advertisement -

నేడు రాజస్థాన్‌తో పోరు

అహ్మదాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే మూడు విజయాలు సాధించి జోరుమీదున్న ఈసారి అదే సంప్రదాయా న్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక కిందటి మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్‌పై ఘన విజయం సాధించిన రాజస్థాన్ కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో రాజస్థాన్ బలోపేతంగా తయారైంది. రియాన్ పరాగ్ పేలవమైన కెప్టెన్సీ వల్ల ఆరంభ మ్యాచుల్లో రాజస్థాన్ వరుస ఓటములు చవిచూసింది. కానీ సంజు శాంసన్ సారథ్య బాధ్యత లు స్వీకరించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అద్భుత విజయం సాధించి పెట్టాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశ లు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ సమతూకంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్, శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, హసరంగ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీం తో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. మరోవైపు గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. జోస్ బట్లర్, సాయి సుదర్శన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, తెవాటియా, వాషింగ్టన్ సుందర్‌లతో గుజరాత్ బలోపేతంగా ఉంది. వరుస విజయాలు సాధిస్తుండడంతో జట్టు ఆత్మవిశ్వా సం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News