Thursday, January 23, 2025

నేడే ఐపిఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్!

- Advertisement -
- Advertisement -

ఆర్ సిబి, ఆర్ ఆర్ జట్ల మధ్య అమీతుమీ మ్యాచ్

అహ్మదాబాద్:  నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నువ్వా, నేనా అన్న మ్యాచ్ జరుగనున్నది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు రాత్రి 7.30 గంటలకు ఈ నువ్వా, నేనా అన్న మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ లో ఓడిన వారు ఇక ఇంటికే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సిబి) ప్లే ఆఫ్ కు చేరుకోడానికి వరుసగా ఆరు మ్యాచ్ లు గెలుచుకుంటూ వచ్చింది. ఆర్ సిబిలో విల్ జాక్స్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. అతడు ఓ ఇంపాక్ట్ ఆటగాడు. కాగా రాజస్థాన్ రాయల్స్ లో కూడా జోస్ బట్లర్ ఆడడంలేదు.

ఏది ఏమైనప్పట్టికి ఆర్ సిబి కి అడ్వంటేజ్ ఉంది. ఎలాగంటే రాజస్థాన్ రాయల్స్ కన్నా క్వాలిటీ ప్లేర్స్ ఆర్ సిబి కి ఉన్నారు. నేడు ఆటలో ఓడే వారు ఇంటికే. కాగా గెలిచిన వారు మాత్రం చెన్నై లో శుక్రవారం జరుగనున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News