6 పరుగుల తేడాతో చెన్నైపై విజయం
గువహటి: ఐపిఎల్ 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష ఛేదనకు దిగిన సూపర్‌కింగ్స్‌ను 174 పరుగులకే కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్ల దాటికి చైన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్(63), రవింద్ర జడేజా(32)లు తప్ప మరెవరూ రాణించలేకపోయారు. రాయల్స్ బౌలర్లలో వాణిండు హ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జాఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లో యశస్వి జైస్వాల్(4) క్యాచ్ ఔట్‌గా నుదిరిగాడు.
బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ రాణా(81) రాణించాడు. సంజూ శాంసన్(20) ధ్రువ్ జురెల్(3), వానిందు హసరంగ(4) తీవ్రంగా నిరాశపర్చారు. షిమ్రాన్ హెట్‌మైర్ సాయంతో రియాన్ పరాగ్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా అతన్ని పతీరణ క్లీన్ బౌల్ చేసి రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేసాడు. జోఫ్రా ఆర్చర్, ఇంపాక్ట్ ప్లేయర్ కుమార్ కార్తీకేయ(1)తో హెట్‌మైర్(19) రాణించలేకపోయారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ 182 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/38), నూర్ అహ్మద్(2/28), మతీష పతీరణ(2/23) రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.