Monday, December 30, 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 8,113 ఉద్యోగాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. 8,113 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో 3144 గూడ్స్ ట్రైన్ మేనేజర్, 1736 టికెట్ సూపర్ వైజర్, 1507 టైపిస్ట్, 994 స్టేషన్ మాస్టర్, 732 సీనియర్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది.

డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఇక, అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజును రూ.500గా నిర్ణయించింది. అయితే.. పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్ చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు ఆర్ఆర్ బి అధికారిక వెబ్‌సైట్ లో తెలుసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News