Thursday, January 23, 2025

రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ఆర్‌ఆర్‌ఆర్

- Advertisement -
- Advertisement -

RRR enters Rs 1000 Crs club
హైదరాబాద్: ఎస్‌ఎస్ రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1000కోట్లు సంపాదించింది. ఇంత మొత్తం సంపాదించిన భారతీయ చిత్రాలు రెండే రెండు. అవి: దంగల్, బాహుబలి2. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోటాపోటీగా నటించారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో ఇంకా ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్ తదితరులు నటించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తి తగ్గకపోయినప్పటికీ ఆర్‌ఆర్‌ఆర్ మంచి వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ విశ్లేషకుడు మనోబాలా విజయబాలన్ శనివారం ట్విట్టర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది’ అని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా యూకె, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో కూడా మంచి వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News