Thursday, January 23, 2025

నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మెరిసింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్ రెండు విభాగాల్లో పోటీ పడుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది.
బుధవారం కాలిఫోర్నియాలో ది బెవర్లీ హిల్టన్ హాల్‌లో ఈ అవార్డుల కార్యక్రమం కనులవిందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, ఎన్‌టిఆర్, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొని సందడి చేశారు. నాటు నాటు పాటకు అవార్డు ప్రకటించినప్పుడు ఎన్‌టిఆర్, రామచరణ్, రాజమౌళ్లి చప్పట్లతో అలరించారు. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అవార్డు గెలిచింది. ఈ అవార్డును ఎంఎం కీరవాణి అందుకున్నారు. చంద్రబోస్ నాటు నాటు పాటను రాయగా ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీ చేశాడు. ఆంగ్లేతర ఉత్తమ చిత్రం రేసులో ఆర్‌ఆర్‌ఆర్ నిలిచింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News