Monday, December 23, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’ ఒక గే లవ్ స్టోరీ: ఆస్కార్ విన్నర్

- Advertisement -
- Advertisement -

 ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 1200 కోట్లను వసూలు చేసి కొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఈ సినిమాను ప్రశంసించేవారితో పాటు విమర్శించే వారూ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రముఖ సౌండ్ డిజైనర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పోకుట్టి కూడా చేరారు. ఎవరో ఇద్దరు నెటిజన్లు చేసిన కామెంట్‌కు సపోర్ట్ చేస్తూ… రసూల్ కూడా ఈ చిత్రాన్ని ‘గే లవ్ స్టోరీ’గా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొదట దర్శకుడు మునీష్ భరద్వాజ్ “ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ అనే ఒక చెత్త సినిమాను చూశాను” అంటూ ట్వీట్ చేశారు. దానికి సపోర్ట్‌గా “ఆర్‌ఆర్‌ఆర్ అనేది ఒక గే లవ్ స్టోరీ” అని రసూల్ రీ ట్వీట్ చేశాడు. అయితే ఆస్కార్ అవార్డు అందుకున్న ఓ వ్యక్తి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం కరెక్టేనా అంటూ నెటిజన్లు రసూల్‌ను ట్రోల్ చేస్తున్నారు.

RRR is Gay Love Story: Oscar Winner Rasool 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News