Saturday, September 21, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఎమోషనల్ సాంగ్..

- Advertisement -
- Advertisement -

'RRR' Janani Song to release on Nov 26th

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది. దీంతో విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో సాంగ్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మూవీలోని జనని అనే ఎమోషనల్ సాంగ్ ను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 10,000కి పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారని సమాచారం. యుఎస్‌లోనే 2,500కి పైగా స్క్రీన్‌లలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ నిలిచే అవకాశం ఉంది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా.. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్ర ఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

‘RRR’ Janani Song to release on Nov 26th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News