Sunday, January 5, 2025

ఢిల్లీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషన్స్… భారీగా తరలివచ్చిన ఫాన్స్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

RRR Movie Promotions in Delhi

హైదరాబాద్: దేశంలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా వస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం). రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తూ చిత్ర బృందం బిజీగా ఉంది. ఇందులో భాగంగా నిన్న సాయత్రం ఢిల్లీలో నిర్వహించిన ఈవెంట్ లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ తోపాటు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పాల్గొని సందడి చేశారు. అభిమానులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ ట్వీటర్ ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ తోపాటు, కర్ణాటకలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్దఎత్తున ప్రమోషన్స్ చేస్తూ జక్కన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొనే చేస్తున్నాడు. దీంతో ఈ మూవీ దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

RRR Movie Promotions in Delhi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News