Friday, December 20, 2024

‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదల వాయిదా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడింది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కావాల్సిన ఈ మూవీని చిత్రయూనిట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు, కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతోపాటు థియేటర్లు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ లెవల్ విడుదల అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడనుంది. దీంతో మూవీ విడుదలను వాయిదా వేయడమే మంచిదని భావించిన యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ మూవీ విడుదల కూడా వాయిదా పడనుందని అందరూ భావించారు. అయితే, అనుకున్న తేదీ జనవరి 14నే ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

RRR Movie Release Date postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News