Monday, December 23, 2024

ఐమ్యాక్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’..

- Advertisement -
- Advertisement -

RRR Movie to Release at IMAX Screens

హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్స్‌ జూనియర్‌ ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ ముఖ్యపాత్రలలో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చి 25న అంతర్జాతీయంగా విడుదల కాబోతుంది. డివివి దానయ్య నిర్మించగా.. బాలీవుడ్ స్టార్లు అజయ్‌ దేవగన్‌, అలియాభట్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఐమ్యాక్స్‌లో కూడా విడుదల చేయబోతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర రూపకర్తలతో కలిసి ఐమ్యాక్స్‌ సంస్థ ఈ విషయాన్ని తెలుపుతూ ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఐమ్యాక్స్‌ సంస్ధ ఈ చిత్రాన్ని యుఎస్‌ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యుకె మరియు మిడిల్‌ ఈస్ట్‌తో పాటుగా ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాయనుందని అంచనా వేస్తోన్న ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ డ్రామా హిందీ, మలయాళం, కన్నడ, తమిళంతో పాటుగా తెలుగులో కూడా విడుదల కానుంది. 1920లలో జరిగిన ఓ కాల్పనిక గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లుగా రామ్‌చరణ్‌, జూనియన్‌ ఎన్‌టీఆర్‌ కనిపించనున్నారు. ఈ కాల్పనిక గాథలో స్వాతంత్య్ర సమరయోధులైన ఇద్దరు స్నేహితులు కలిస్తే ఎలా ఉంటుందన్న ఊహకు ప్రతిరూపమిచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో భారతీయ చిత్రాలపై తమ దృష్టిని సారించిన ఐమ్యాక్స్‌, ఇప్పుడు ప్రేక్షకులకు అద్వితీయ అనుభవాలను అందించడానికి సిద్ధమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఐమ్యాక్స్‌ పోస్టర్‌ ఈ చిత్రం పట్ల వీక్షకుల అంచనాలను మరింత పెంచే రీతిలో ఉంది.

RRR Movie to Release at IMAX Screens

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News