Monday, December 23, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

RRR Movie to release on March 25th 

‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఆచార్య, సర్కారువారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ ౩ విడుదల తేదీల ఖరారు
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సరికొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల తేదీని ప్రకటించడంతో ఇతర పెద్ద సినిమాల రిలీజ్ డేట్లను కూడా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల చేయనున్నామని మేకర్స్ తెలియజేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రముఖ పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్ర విడుదల తేదీని కూడా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మరొకసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా మెహ్రీన్, తమన్నాలు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

RRR Movie to release on March 25th 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News