Saturday, January 25, 2025

ఆస్కార్ బరిలోకి దిగుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’

- Advertisement -
- Advertisement -

Avengers Endgame Director about RRR

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఎంతగానో అలరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆస్కార్ బరిలోకి దిగుతోంది. బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోకి దిగుతుండడం విశేషం. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం సినిమా లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆస్కార్ అవార్డ్ బరిలో దిగుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. “ఆర్‌ఆర్‌ఆర్ సినిమా భాష, సాంస్కృతిక సరిహద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను ఏకం చేసింది. కొన్ని నెలలుగా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరి వల్లనే ఆస్కార్ బరిలోకి దిగుతున్నాం. జనరల్ కేటగీరిలో ఆస్కార్ అవార్డ్స్ కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన వారందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అని ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇక హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ బరిలో ఉండే అవకాశం ఉందని చెప్పడంతో… ఈ సినిమాకు అవార్డు తప్పక వస్తుందని గట్టిగా ప్రచారం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీ క్రేజ్ గురించి మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఇండియా తరఫున ఆస్కార్‌కు పంపిస్తే ఈ చిత్రం తప్పకుండా అవార్డును గెలుచుకుంటుందని పేర్కొన్నాడు. కానీ గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ను భారతదేశం తరపున ఆస్కార్ నామినేషన్‌కు పంపుతున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయినప్పటికీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ మాత్రం నిరుత్సాహపడలేదు. జనరల్ కేటగీరిలో అవార్డు కోసం పోటీపడాలని నిర్ణయించుకుంది. ఇక దర్శకధీరుడు యస్‌యస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.

RRR Team applied for Oscar in General Category

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News