Monday, January 20, 2025

వీరనాటు..

- Advertisement -
- Advertisement -

‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది కానీ.. ఈ పాట మేకింగ్ కోసం ఎంత కష్టమైందో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రమోషన్ సమయంలో హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్దం జరుగుతున్న ఉక్రెయిన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. పాటలో కనిపించే ప్యాలస్ నిజమైనది. ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసం. అక్కడ చిత్రీకరణకు అనుమతులు దక్కించుకుని చిత్రీకరణకు చాలా కష్టాలు పడ్డామని ఆ సమయంలో రాజమౌళి పేర్కొన్నారు. ఇక ఈ పాటలోని హుక్ స్టెప్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఏకంగా 80 వర్షన్‌లను రికార్డ్ చేశాడని.. చివరకు హీరోలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని స్టెప్స్ వేయడాన్ని ఖరారు చేయడం జరిగిందని చెప్పారు. ఇక ఈ పాటలో ఇద్దరు హీరోలు సింక్ అయ్యేలా స్టెప్స్ చేయడానికి..

దుమ్ము రావడానికి కూడా డా ల మీద తీసుకున్నారట. ఇద్దరు హీరోల స్టెప్స్ సింక్ అయ్యేలా ఏకంగా 18 తీసుకున్నట్లుగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ పాట సమయంలో రాజమౌళి పై కోపం వచ్చిందని కూడా సరదాగా ఎన్టీఆర్ కామెంట్స్ చేశాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని నాటు నాటు సాంగ్ విడుదల అయినప్పటి నుండి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. మొదట పాటలోని ఇద్దరు హీరోల డాన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నాటు నాటు… అంటూ సినీ ప్రేమికులు కాళ్లు కదిపారు. ఈ అవార్డుపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో మాటల్లేవు అన్నట్లుగా దండం ఈమోజీని షేర్ చేశారు. “నిజంగా మ్యూజిక్‌కి సరిహద్దులు అనేవి ఉండవని నిరూపితమైంది. కంగ్రాట్స్, థాంక్యూ పెద్దన్న” అంటూ రాజమౌళి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
దేవుడు కరుణించి వరమిచ్చాడు : చంద్రబోస్
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని అత్యంత అద్భుతమైన ‘నాటు నాటు’ సాంగ్‌కు అంతే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్. ఇప్పటి వరకు ఎన్నో గొప్ప అవార్డులను పురస్కారాలను దక్కించుకున్న చంద్రబోస్ నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఎమోషనల్‌గా వ్యాఖ్యలు చేశారు. చంద్రబోస్ స్పందిస్తూ… “నా జీవితంలో మరచిపోలేని మధుర క్షణమిది. నాటు నాటు సాంగ్ విశ్వ వేదికపై విజయాన్ని సొంతం చేసుకుంది. రచయితగా ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల సినీ ప్రస్థానంలో 850 సినిమాల్లో 3600 పాటలకు సాహిత్యాన్ని అందించాను. మొదటి సాంగ్ నుండి మొన్నటి ‘వాల్తేరు వీరయ్య’ పాటల వరకు ప్రతి పాటకు కూడా ఒక తపస్సు మాదిరిగా కష్టపడుతాను. ఇన్నాళ్లుగా… ఇన్నిసార్లు తప్పస్సు చేస్తే దేవుడు ఇప్పుడు కరుణించి వరం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు”అని అన్నారు.
ఆ కష్టం ఇక్కడి వరకు నడిపించింది : చరణ్
అందమైన టార్చర్, అద్భుతమైన లుక్ మమ్మల్ని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరకు తీసుకొచ్చిందని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. రెడ్ కార్పెట్ డిజిటల్ ప్రీ షోలో మార్క్ మాల్కిన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ తమను భారతదేశం నుంచి గ్లోబల్ స్పేస్‌కి నడిపించిన అద్భుతమైన విషయాలను పంచుకున్నారు. వెరైటీ మార్క్ మాల్కిన్‌కి ఈ సినిమా మార్వెల్ మూవీని తలపించిందట. రామ్‌చరణ్‌ని చూస్తే మార్వెల్ యాక్టర్‌లాగా కనిపించారట. ఈ విషయాన్నే ఆయన చరణ్‌తో ప్రస్తావించారు. మార్వెల్ స్టార్‌గా, సూపర్‌హీరోగా చేయాలనుకుంటున్నారా? అని రామ్‌చరణ్‌ని ప్రశ్నించారు. దానికి స్పందించిన రామ్‌చరణ్ “తప్పకుండా. ఎందుకు చేయను” అని అన్నారు. తన ఫేవరేట్ మార్వెల్ స్టార్ కెప్టెన్ అమెరికా అని అన్నారు. నాటు నాటు పాట చిత్రీకరణలో, యాక్షన్ సీక్వెన్స్‌లో ఎక్కువగా ఎవరు గాయపడ్డారు అనే ప్రశ్న ఎదురైంది రామ్‌చరణ్‌కి. దానికి స్పందించిన చరణ్ “దాని గురించి మాట్లాడటానికి ఇప్పటికీ నా మోకాళ్లు వణుకుతున్నాయి. అయినా చేశాం. అలాగే చేశాం. అది అందమైన టార్చర్. ఆ కష్టం, ఆ విధానం, లుక్ మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించాయి. ఇక్కడ అందరి ముందు నిలుచుని మాట్లాడగలుగుతున్నామని అంటే దానికి కారణం అదే” అని చెప్పారు.
అంతకు మించిన విజయం : ఎన్టీఆర్
‘ఆర్‌ఆర్‌ఆర్’కి అంతర్జాతీయ వేదిక మీద అందుతున్న అద్భుతమైన స్పందన గురించి రెడ్ కార్పెట్ మీద ఎన్టీఆర్ మాట్లాడుతూ “రాజమౌళితో పనిచేయడం వల్ల, ఆయన ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకోవడం వల్ల గమనిస్తే తప్పకుండా మేం గోల్డెన్ గ్లోబ్ గెలుస్తామనే నమ్మకం ఏర్పడింది. కానీ ఇప్పుడు మేం చూస్తున్నది కేవలం గెలుపు మాత్రమే కాదు. అంతకు మించిన విజయం.. మొన్నామధ్య జపాన్‌లోనూ, ఇప్పుడు అమెరికాలోనూ…” అని అన్నారు. ‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల కాలభైరవతో కలిసి ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ “ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ పాటలో ప్రేమ్క్ష్రిత్ మాస్టర్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్, రామ్‌చరణ్ డ్యాన్స్ అద్భుతంగా ఉంది”అని అన్నారు. కాలభైరవ మాట్లాడుతూ ‘నాటు నాటు’కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఎంతో హ్యాపీగా ఉందని చెప్పారు.
సినీ ప్రముఖుల ప్రశంసలు…
‘ఆర్‌ఆర్‌ఆర్’ నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు పట్ల దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్‌లో.. “ఎంత అపూర్వమైన, చారిత్రాత్మక విజయం! గోల్డెన్ గ్లోబ్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – మోషన్ పిక్చర్ అవార్డు పొందిన కీరవాణికి కంగ్రాట్స్. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి, ఎస్‌ఎస్ రాజమౌళికి హృదయపూర్వక అభినందనలు. ఇండియా గర్విస్తోంది” అని రాసుకొచ్చారు. అలాగే ఏఆర్ రెహమాన్ చేసిన ట్వీట్‌లో.. “అద్భుతం.. అసాధారణ మార్పు.. కీరవాణికి భారతీయులు అందరూ, మీ అభిమానుల నుండి కంగ్రాట్స్! ఎస్‌ఎస్ రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి అభినందనలు”అని రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News