Monday, December 23, 2024

అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ హవా.. మరో అవార్డు సొంతం

- Advertisement -
- Advertisement -

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంతర్జాతీయ వేదికలపై అవార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్‌, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల‌ను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్’కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు దక్కింది.

తాజాగా సియాటిల్ క్రిటిక్స్ అవార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్’ గెలుచుకుంది. బెస్ట్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ కేట‌గిరీలో ఈ అవార్డును అందుకుంది. ఆస్కార్ అవార్డుల్లోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కాగా, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ వరల్డ్ వైడ్ గా ప్రశంసలు అందుకుంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News