Sunday, December 22, 2024

‘ఆర్ఆర్ఆర్’ మరో రికార్డు: ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా క్రిటిక్స్ చాయిస్ అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు దక్కింది. లాస్ ఏంజెల్స్ లో జరుగుగున క్రిటిక్స్ చాయిస్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డును ఆర్‌ఆర్‌ఆర్ గెలుచుకుంది. ఇటీవల జరిగిన గోల్డెన్ అవార్డ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో కీరవాణి స్వరపరిచిన నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

2023 సంవత్సరానికి గాను లాస్ ఏంజెలెస్‌లో జరుగుతున్న క్రిటిక్స్ చాయిస్ అవార్డ్సులో ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డు కోసం ఆల్ క్వైట్ ఆన్ ఆది వెస్టర్న్ ఫ్రంట్, అర్జంటీనా 1985, బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్, క్లోస్, డిసిషన్ టు లీవ్ వంటి చిత్రాలతో పోటీపడి ఆర్‌ఆర్‌ఆర్ అవార్డును గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News