Monday, December 23, 2024

అదృష్టవంతుడు అంటే ఆ గ్యాస్ డెలివరీ బాయే… ఆ యాప్ లో కోటిన్నర జాక్ పాట్

- Advertisement -
- Advertisement -

పాట్నా: అదృష్టం ఎలా కలిస్తుందో ఎవరికి అర్ధం కాదు.. అదృష్టవంతుడిని చెడగొట్టలేము… దురదృష్టవంతుడిని బాగుచేయలేము అనే సామేత కూడా ఉంది.  క్రికెట్ ఫాంటసీ గ్రేమ్‌లో ఓ యువకుడు కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. డ్రీమ్-11 యాప్‌లో గేమ్ ఆడిన గ్యాస్ డెలవరీ బాయ్ కోటిన్నర రూపాయలు గెలిచాడు. బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్ ఓ గ్యాస్ ఎజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. క్రికెట్‌పై మక్కువ ఉండడంతో జనవరి 14న జరిగిన భారత్-ఆఫ్ఘానిస్థాన్ టి20 మ్యాచ్ సందర్భంగా రూ.49 పెట్టి డ్రీమ్-11లో గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో సాధిక్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దీనిపై గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర స్పందించారు. సాదిక్ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడిన వెంటనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News