Monday, December 23, 2024

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ. 1.51 కోట్ల వైద్యపరికరాలు విరాళం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ రూ. 1.51 కోట్ల విలువైన వైద్యపరికరాల కొనుగోలుకు విరాళం అందించారు. ఈ మేరకు గురువారం టిటిడి పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డితో ఎంఓయు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సిఎండి సిబి.అనంతకృష్ణన్ మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ అద్భుతమైన సేవలు అందిస్తోందని, ఎంతో మంది పేదలు మెరుగైన గుండె వైద్యసేవలు పొందుతున్నారని కొనియాడారు.

ఈ ఆసుపత్రికి అవసరమైన మూడు ఆపరేషన్ థియేటర్ అనస్థీషియా వర్క్ స్టేషన్ వెంటిలేటర్స్ విత్ మానిటర్స్ కొనుగోలుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా విరాళం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఈవో సదా భార్గవి, సివిఎస్‌వో నరసింహ కిషోర్, సంస్థ హెచ్‌ఆర్ డైరెక్టర్ ఎబి. ప్రధాన్, సీనియర్ మేనేజర్ సౌమెన్ చౌదరి, ఎఫ్‌ఏసిఏవో బాలాజి, అదనపు ఎఫ్‌ఏసిఏవో రవిప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News