Sunday, December 22, 2024

‘శంషాబాద్’లో రూ. 1.65 కోట్ల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs. 1.65 crore gold seized In Shamshabad

హైదరాబాద్(శంషాబాద్) : శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 1.65 కోట్ల విలువైన 3 కిలోల 140 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం నాడు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలోని అన్ని మార్గాలలో నిఘా ఏర్పాటు చేశారు. కస్టమ్స్ అధికారులు నిఘా సారించారన్న విషయం తెలుసుకున్న స్మగ్లర్లు విమానాశ్రయంలోని కోవిడ్ సెంటర్ వద్ద ఓ వైద్య ఉద్యోగినికి 3 కిలోల 140 గ్రాముల బంగారం బ్యాగ్‌ను అప్పగించిన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్మగ్లర్ల ఇచ్చిన బంగారాన్ని కోవిడ్ సెంటర్‌లోని వైద్య ఉద్యోగిని దాచి ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే వైద్య ఉద్యోగిని అదుపులోకి తీసుకుని 3 కిలోల 140 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వైద్య ఉద్యోగికి, బంగారం తరలిస్తున్న స్మగ్లర్లకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కస్టమ్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు.

నిందితుల కోసం వేట… 
శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 1.65 కోట్ల విలువైన 3 కిలోల 140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుల కోసం వేటసాగిస్తున్నారు. ఈక్రమంలో వైద్య ఉద్యోగినిని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా విమానాశ్రయంలోని అన్ని మార్గాలలో సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. విమానాశ్రయంలోని కోవిడ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్య ఉద్యోగినికి బంగారం అప్పగించిన స్మగ్లర్మకు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా కోవిడ్ సెంటర్ పరిసరాలలో ఉన్న సిసిటివి కెమెరాలను ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News