- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ లోని బాబూల్ రెడ్డి నగర్ లో ఓ గిడ్డంగిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శంషాబాద్ ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు నల్ల మందు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలో రూ. 1 కోటి 60లక్షల విలువ చేసే నల్ల మందును గుర్తించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు అరెస్టు అయ్యారు. వారి నుంచి బోలెరో వాహనం, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -